Thursday 1 May 2014

అక్షయ తృతీయ వేలం వెర్రి!

లక్ష్మీం క్షీరసముద్రరాజ తనయాం శ్రీరంగధామేశ్వరీమ్ |
దాసీభూత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురామ్ ||

అందువల్ల సముద్ర జలాల నుంచి తయారయ్యే ఉప్పు కూడా లక్ష్మీదేవి స్వరూపమేనంటారు. నిజంగా పేదవాడు అక్షయ తృతీయ మీద అంత విశ్వాసం ఉంటే బంగారం బదులు ఉప్పుకొనుక్కుంటే అదే పదివేలు. వచ్చే సంపద రాకుండా మానదు. చేతుల్లో డబ్బున్నప్పుడు మన స్తోమతను బట్టి బంగారం కొనుక్కుంటూపోతే అదే సంపదగా పోగుబడుతుంది. ప్రత్యేకంగా అక్షయ తృతీయ రోజున ఉప్పు కొనాలన్న సంగతి పురాణాలకే పరిమితమై, నగలను కొనడం మాత్రమే నేడు వేలం వెర్రిగా మారింది. 
ఉప్పుకొన్నాసౌభాగ్యమే...!http://www.aptopnews.com/

2 comments:

విన్నకోట నరసింహా రావు said...

అక్షయ తృతీయ రోజున బంగారం షాపుల ముందు పొద్దున్నించే క్యూ లో నిలబడి బంగారం కొనుక్కోవడం. ఇది బంగారం వ్యాపారులు లాభపడటానికే అనుకుంటాను. దానికితోడు ఎగదోస్తున్న మీడియా (అదీ ఒక వ్యాపారమే కదా). ఈ వలయంలో చిక్కుకున్నట్లు కనిపిస్తోంది ఈనాటి సమాజం. ఎవరి నమ్మకాలు వాళ్ళవి అనుకోవచ్చు, కాని మీరన్నట్లు "వేలం వెర్రి" అనేది సరైన పదం అనిపిస్తోంది. అవునూ అక్షయ తృతీయ నాడు బంగారం కొంటే అంత మంచిదంటున్న నగల వ్యాపారులు కూడా ఈరోజున ఎంతో కొంత బంగారం కొంటారా వాళ్ళ ఇంటి కోసం, లేక ప్రజల చేత కొనిపించి వ్యాపారం వృద్ధి చేసుకోవటమే లక్ష్యమా?

nihar said...

నా వాదనను సమర్ధించినందుకు థాంక్యూ. కేవలం వ్యాపారుల ప్రయోజనాల కోసమే మన మీడియా కూడా అక్షయ త్రుతీయకు లేని ప్రాధాన్యం ఇస్తోంది. అందుకే మధ్య తరగతి జనం ఆ మాయలో పడి బంగారం షాపుల ముందు క్యూ కడుతున్నారు.