Wednesday 7 May 2014

80 శాతం ఎవరికి లాభం?

డివైడెడ్ ఆంధ్రప్రదేశ్ కు యునైటెడ్ గా జరుగుతున్న  ఎన్నికల్లో పోలింగు ఘట్టం ముగిసింది. తెలంగాణాతో పోల్చితే పోలింగు శాతం పెరిగిందని ఎన్నికల అధికారులు సంబరపడుతున్నారు. 80 శాతం పోలింగు సాధించేందుకు అధికారులు నానా తంటాలు పడ్డారు. అయితే ఇంత భారీ పోలింగు ఎవరికి లాభం...? ఏ పార్టీ విజయావకాశాలను పెంచుతుంది...? సీమాంధ్రలో తమ గాలే వీస్తోందన్న ధీమాతో ఉన్న  పార్టీకి ఈ పర్సంటేజ్ నష్టం తెస్తుందా..? ఓటింగు శాతం పెరగకుండా ఫలానా పార్టీ జనాన్ని భయభ్రాంతులకు గురిచేసిందని చక్రం తిప్పే ఓ బడా నేత ఎందుకు ఆరోపించారు...?
అధికారులు ఆశించినట్లే అటూఇటూగా 80 శాతం లెక్క తేలింది. ఇక అధినేతలకు మెజారిటీల గుబులు పట్టుకుంది. సీమాంద్ర సీఎం కుర్చీ మీద కన్నేసిన టీడీపీ, వైసీపీ అధినేతలు సీట్ల లెక్కల్లో మునిగిపోయారు. 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మెజారిటీ చోట్ల ఆధిక్యాలు చాలా స్వల్పంగా ఉంటాయన్నది అంచనా. పోటీ టీడీపీ, వైసీపీల మధ్యే కొనసాగింది. కాంగ్రెస్ అభ్యర్థులు నామమాత్రమే. http://www.aptopnews.com/seemandhra-news/576-80

ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకోవడానికి మన నాయకులు ఎన్నోరకాలుగా ప్రయత్నించారు. నానా పాట్లు పడ్డారు. ఇంతకీ ఈ దేవుడు ఎవరిని కరుణించాడో.. ఎవరిని పీఠం ఎక్కిస్తాడో!

No comments: