Tuesday 20 May 2014

‘ఆప్’ ఆమ్కే హై కౌన్!


చెడపకురా చెడేవు అన్న సామెతలా తయారైంది ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ పరిస్థితి. కాంగ్రెస్ తమ ప్రధాన శత్రువంటూ పార్టీ ఆరంభించారు. అవినీతిపైనే తమ పోరాటమన్నారు. చివరికి బీజేపీని టార్గెట్ గా చేసుకుని ఎన్నికల పోరాటం సాగించారు కేజ్రీవాల్. ముఖ్యంగా బీజేపీ ప్రధాని కేండిడేట్ గా నరేంద్ర మోడీ బరిలోకి దిగిన వారణాసి నుంచే కేజ్రీవాల్ పోటీ చేయడం ఏదో మతలబుందనిపించింది. మోడీపై పోటీ చేస్తే బాగా ప్రచారం జరుగుతుందన్న ఆలోచన ఉన్నా గట్టి పోటీ ఇవ్వగలిగారు. కేజ్రీవాల్ ఈ ఎన్నికల్లో స్పాయిల్ స్పోర్ట్స్ ఆడారన్న విమర్శ ఉంది. ఢిల్లీ అసెంబ్లీ ఫలితాల్లో థర్డ్ ప్లేస్ వచ్చినా కాంగ్రెస్ మద్దతుతో సర్కారును ఏర్పాటు చేయడం.. 49 రోజుల్లోనే జెండా ఎత్తేయడం కేజ్రీవాల్ టీమ్ ను వీక్ చేసింది. కనీసం 20 పార్లమెంటు సీట్లైయినా వస్తాయన్న ఊహాగానాలునడిచాయి. చివరికి ఆమ్ ఆద్మీ పార్టీ ఉనికి నామమాత్రమే అని తేలిపోయింది. అవినీతికి వ్యతిరేకంగా ప్రజల్లో ఆలోచన రేకెత్తించిన ఘనత కచ్చితంగా కేజ్రీవాల్ దే. నిజంగానే యువత అవినీతికి వ్యతిరేకంగా కదిలారు. ఓటింగులోనూ పాల్గొన్నారు. కానీ ఆ ఓట్లన్నీ కేజ్రీవాల్ కు పడకుండా కాంగ్రెస్కు వ్యతిరేకంగా బీజేపీ ఖాతాకు జమయ్యాయి. జనంలో స్పందన కలిగించగలిగారు కానీ.. ఓట్లేసి గెలిపిస్తే ఏదైనా చేయగలరన్న భరోసా ఇవ్వలేకపోయారు. ఇదే కేజ్రీవాల్ బలహీనత. మొత్తానికి కాంగ్రెస్ పార్టీపైన జనంలో ఉన్న వ్యతిరేకతను మరింత రెచ్చగొట్టడంలో సక్సెస్ అయ్యారు. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ బలం పెరగలేదు. ఆ ఓట్లన్నీ కమలం వైపు పడ్డాయి. మోడీ హవాకు ఇది తోడైంది. బీజేపీ సీట్ల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగేందుకు దోహదపడింది.http://www.aptopnews.com/

1 comment:

hari.S.babu said...

ఆప్ హం కే కౌన్ హై?