Friday 16 May 2014

అమెరికాయే నమోకరిల్లుతోంది!

నరేంద్రమోడీ సాధించిన విజయం అట్లాంటి ఇట్లాంటి విజయం కాదు. అమెరికా అహం మీద చావుదెబ్బకొట్టారు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ప్రధానిగా ఎన్నికవడం ఒకెత్తయితే.. ఇన్నాళ్లూ తనకు వీసా నిరాకరించిన అగ్రరాజ్యం కూడా కదిలొచ్చి రెడ్ కార్పెట్ స్వాగతాలు చెప్పేలా చేశారు.


బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే అపూర్వ విజయం సాధించగానే అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మోడీకి ఫోన్ ద్వారా శుభాకాంక్షలు చెప్పారు. తమ దేశానికి రావాలని ఆహ్వానించారు. భారత్-అమెరికా సంబంధాలతో పాటు ప్రపంచ ఆర్ధిక పరిస్థితిని మోడీతో చర్చించారు. ఇక భారత్ వెలిగిపోవడం ఖాయమన్న ఆశాభావం ఒబామా మాటల్లో కనిపించింది. గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మోడీ అమెరికాలో పర్యటించాలనుకుంటే వీసా నిరాకరించిన అమెరికా ఇప్పుడు కళ్లు తెరిచింది. గతంలో మూడు నాలుగు దఫాలు అగ్రరాజ్యం అహంకారంతో వ్యవహరించింది. మోడీ తన పర్యటన మానుకుని ఇక్కడి నుంచే అమెరికాలోని ఓ యూనివర్సిటీ విద్యార్థులను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. గోధ్రా అల్లర్లతో నరేంద్ర మోడీపై మతపరమైన ముద్ర పడింది. ఈ కారణంగానే అమెరికా ఆయనను దూరంగా పెట్టేది. ఇప్పుడా మచ్చలన్నీ చెరిగిపోతున్నాయి. వైట్ హౌసే ఎర్రతివాచీలు పరుస్తోంది.

వ్వనంలో మోడీ హిమాలయాలకు ఎందుకు వెళ్లాడు...!

 http://niharkid.blogspot.in/2014/04/blog-post_6.html

మోడీ చెప్పిన పిజ్జా కథ! 

http://niharkid.blogspot.in/2013/04/blog-post_9.html 

మోడీ వారసురాలు! 

http://niharkid.blogspot.in/2014/05/blog-post_13.html 

మోడి నెత్తిన టోపీయే! 

http://niharkid.blogspot.in/2014/05/blog-post_6.html 

 మోడీ స్టైల్ అమెరికా ట్రైనింగా..! 

http://niharkid.blogspot.in/2014/04/blog-post_3143.html 

'మోడి"ఫైడ్ స్తైల్ 

http://niharkid.blogspot.in/2014/04/blog-post_19.html 

యవ్వనంలో మోడీ హిమాలయాలకు ఎందుకు వెళ్లాడు...! 

http://niharkid.blogspot.in/2014/04/blog-post_6.html

మొసళ్ళ చెరువులో దూకిన మోడి 

http://niharkid.blogspot.in/2014/04/blog-post.html 

 

 

 

 

 

No comments: