పేదరికాన్ని జయించిన చదువుల తల్లి
చదువుకోవాలనే ఆసక్తి, చదువుతున్న దాని మీద ధ్యాస ఉండాలేగానీ ఉన్నత శిఖరాలను అధిరోహించడం పెద్ద కష్టమేమీ కాదు. ముంబైకి చెందిన ఆటో డ్రైవర్ జయకుమార్ కుమార్తె ప్రేమ చార్టర్డ్ అకౌంటెన్సీ(సీఏ) కోర్సులో తొలి ప్రయత్నంలోనే జాతీయ టాపర్ గా నిలిచింది. ఆమె సోదరుడు దన్ రాజ్ కూడా సీఏలో మొదటి ప్రయత్నంలోనే ఉత్తీర్ణత సాధించారు.కొన్నేళ్ల క్రితం జయకుమార్ కుటుంబం బతుకు దెరువు కోసం చెన్నై నుంచి ముంబై వలస వెళ్లింది. జయకుమార్ ఆటో తోలుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. పేదరికం ఉన్నా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ఈ అక్కాతమ్ముళ్లిద్దరూ చక్కగా చదువుకున్నారు. ఎంతో కష్టమనుకునే సీఏ కోర్సులో జాతీయ స్థాయిలో టాపర్ గా నిలిచిన ఇరవై నాలుగేళ్ల ప్రేమ ఈ తరం విద్యార్థులకు ఎంతో ఆదర్శనీయం.
No comments:
Post a Comment