VIVEKANANDA: his call to the students
యువత ఆశాజ్యోతి స్వామి వివేకానంద
స్వామి వివేకానంద 150 జయంతి ఈ ఏడాదంతా జరుగుతున్నాయి. వివేకానందుడు విద్యార్థికి జ్ఞానం, శీలం ప్రభోదించిన యోగి, తత్వవేత్త, ఆధ్యాత్మిక పురుషుడు. ఈ సందర్భంగా విద్యార్థుల కోసం వివేకానందుడు చేసిన మార్గ నిర్దేశనం చూద్దాం...
-విద్యంటే మనిషిలో జన్మతా ఉండే నైపుణ్యానికి మెరుగు పెట్టడమే.
- పుస్తకం చదవడమే విద్యాభ్యాసం కాదు. విద్య అంటే అపార విజ్ఞాన సంపద.
- మనసును విషయం మీద కేంద్రీకరించడమే విద్య. వివరాలను తెలుసుకోవడమొక్కటే కాదు.
- నిజమైన విద్యంటే మనిషి తన కాళ్ల మీద తాను నిలబడేలా చేయగలిగేది.
- సామాన్యుడికి బతుకుదెరువు చూపించలేని చదవు చదువే కాదు.
- మనిషికి వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడని విద్యతో ఏ మాత్రం ఉపయోగం లేదు.
- చదువంటే విషయాన్ని బుర్రలోకి ఎక్కించడం కాదు. జీవనమార్గాన్ని తెలుసుకోడం. వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవడం.
- చదవు వల్ల ఆలోచనా విధానం మారాలి. ఓ గ్రంధాలయంలోని పుస్తకాలన్నీ కంఠస్థం పట్టినవాడికన్నా సద్బుద్ధి, సత్‌ప్రవర్తన, సదాలోచన ఉన‌్న వాడు వెయ్యి రెట్లు నయం.
- అందరూ పెత్తనం చెలాయించాలని చూశేవారే. ఎవరూ ఆజ్ఞల్ని శిరసావహించేందుకు సుముఖత చూపించరు. ముందు ఆచరించడం నేర్చుకుంటే ఆజ్ఞాపించడం దానంతటదే వస్తుంది. సర్వెంట్‌గా పని నైపుణ్యాన్ని సంపాదించినవాడే అసలైన మాస్టర్‌గా తయారవుతాడు.
- .మనషుల్లో శ్రద్ధాసక్తులు తగ్గిపోతున్నాయి. అవి ఉన్నవాడు శక్తిమంతుడైతే... లేని వాడు బలహీనుడిగా మిగిలిపోతున్నాడు.
- పేదరికం కారణంగా ఏ పిల్లవాడైనా చదువకు దూరమైతే విద్యావ్యవస్థే అతడికి చేరువకావాలి.
1 comment:
Really Swami Vivekananda is a spirit for students...
Post a Comment