KIDS NEWS: సినీ'మాయ'లో పడొద్దు..!
జాతీయ భావం ఉప్పొంగే వేళ!
గణతంత్ర దినోత్సవం... విద్యా సంస్థల్లో సంబరాలే సంబరాలు. పిల్లల దేశభక్తి గీతాలు, నృత్య ప్రదర్శనలతో అలరిస్తుంటారు. ఈ తరుణంలోనైనా సినిమా పాటల జోలికివెళ్లకుండా జాతీయ భావం ఉట్టిపడేలా దేశ భక్తి గీతాలు, లలిత గీతాలు పాడుకోండి. ఇలాంటి పాటలకు డాన్సులు వేయండి. నృత్యరూపకాలు ఇలాగే ఉండేలా చూడండి.
దేశమును ప్రేమించుమన్నా... మంచి అన్నది పెంచుమన్నా....
ముక్కుపచ్చలారని చిన్నారులకు తళుకు బెళుకుల డ్రెస్సులు వేసి బూతు పాటలకు స్టెప్పులు వేయించి తమ పిల్లలు ఏవో అద్భుతాలు సాధించారన్నట్లు సంబర పడిపోకండి. పేరెంట్స్, టీచర్స్ ఏం చెప్పినా, చిన్నారులైనా ఈ విషయంలో జాగ్రత్త పడటం మంచిది. కనీసం జాతీయ పర్వదినాల్లోనైనా దేవభక్తిని చాటండి.
No comments:
Post a Comment