సంక్రాంతి పండగ సీజన్ కదా... హడావిడి అంతా చిన్నారులదే. ఇది గాలి పటాలు ఎగువవేసే సమయం. ఇందులో ఆనందం ఎంత వుందో ఏఆ మాత్రం ఊమరుపాటుగా ఉన్నా డేంజరే. గాలి పటాలెగురవేసే టైంలో చిన్నారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం...1. డాబాల మీద గాలిపటాలు ఎగురవేయవద్దు. మైదానాలు, ఖాళీ ప్రాంతాల్లో అయితే మంచిది.2. తెగిన గాలిపటాలు పట్టుకునేందుకు గుంపులుగా పరుగులు తీయవద్దు. వాహనాలు ఢీకొనడం, కింద పడిపోవడం లాంటివి జరుగుతాయి. 3. విద్యుత్ వైర్లు, గోతులు, నీటి సంపులు ఉన్న చోట ఈ ఆటలు విషాదమే మిగులుస్తాయి.4. మాంజా దారం మరీ పదునుగా ఉంటుంది. చిన్నారులు చేతులు పదిలంగా చూసుకోవాలి.5. ఇరుగు పొరుగు నివాసాల్లో గాలిపటాలు పడితే తెచ్చుకోవడానికి గోడలు దూకవద్దు. 6. పతంగులు చెట్లకు చిక్కుకుంటే పైకెక్కి పడిపోయే ముప్పుంటుంది. ఇలాంటివి ఎప్పుడూ చేయవద్దు.7. చిన్నారుల ఆటలు ఏవైనా ఎలాంటి ముప్పు జరగకుండా తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలి.
బెస్టాఫ్ లక్... గాలి పటాలు ఎగురవేయండి. ఎంజాయ్ చేయండి.
2 comments:
nice suggestions, hasinidatta
ThanQ, keep reading my blog... NIHAR, a kids world.
Post a Comment