గాడ్జెట్ గురూ... డోరెమాన్!
గాడ్జెట్ గురూ... డోరెమాన్!
నోమితాలా నేనూ ఓ గాడ్జెట్ అడుగుతానిస్తావా..!
నువ్విచ్చే గాడ్జెట్‌తో...
ఆకాశంలో రెక్కల గుర్రంలా ఎగరాలని లేదు.
మహిళలను గౌరవించలేని పురుషాధిక్య సమాజంలో నేరాలెక్కువయ్యాయి!
తలవంపులు తెచ్చిపెడుతున్న ఈ మానవమృగాలను నువ్వే చీల్చిచెండాడేయ్.
----
ఈ పవిత్ర భారత దేశంలో మహిళ స్వేఛ్ఛగా తిరగలేని దురవస్థ...
కోర్టుల్లో కేసులు అలా అలా పెండింగులో...
న్యాయస్థానంలో న్యాయ దేవతకు ఎవరో గంతలు కట్టేశారు!
వాటిని విప్పితే గానీ బాధితులకు జరిగిన అన్యాయమేమిటో అర్ధం కాదు.
పోలీసు స్టేషన్‌లలోనూ ధర్మం నాలుగు పాదాల నడవడం లేదు!
కనిపించని ఆ నాలుగో సింహం ఇటు తిరిగితే గానీ-
మహిళలకు జరుగుతున్న కష్టం, నష్టం ఎలావుంటాయో తెలియదు!
గాడ్జెట్ గురూ... డోరెమాన్!
నువ్వే రక్షించు ఈ భారతాన్ని మగరూప రాక్షసుల నుండి...!
No comments:
Post a Comment