Thursday, 7 March 2013

12 దాటితే డేంజర్ బెల్స్!

పసితనమే కలుషితమా!
బాలల మనస్సు తెల్ల కాగితంలాగా స్వచ్ఛంగా... నిష్కల్మషంగా ఉంటుంది. పదహారు పదిహేడేళ్లు వచ్చేదాకా తల్లిచాటు బిడ్డల్లా ఎదుగుతారు. ఇది చాలా కుటుంబాల్లో ఒకప్పటి మాట. ఇప్పుడు కల్చర్ మారింది. ట్రెండ్ మారింది. జనరేషన్ కూడా మారుతోంది. మన ప్రభుత్వ లెక్కల ప్రకారం బాలలు పద్దెనిమిదేళ్లు నిండితేనే మైనారిటీ తీరిపోయి మేజర్లుగా మారుతారు. అంటే స్వతంత్రంగా ఆలోచించి, స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోగల చట్టబద్ధమైన వయస్సు. కానీ ఇప్పుడు పిల్లల ప్రవర్తన, నడవడి, ఆలోచన... ఇలా అన్ని వ్యవహారాలు మారిపోతున్నాయి. తప్పెక్కుడుందనేది పెద్ద ప్రశ్న. సమాజానిదా... సామాజంలో భాగమైన మనదా?

బాల్యం పన్నేండేళ్ల దాకానే...!

అమెరికాలో ఓ టీనేజర్ స్కూల్లో చొరబడి తుపాకీతో డజన్లకొద్దీ పిల్లలను కాల్చిపారేశారు. పవిత్ర భారతావని తలవంచుకునేలా చేసిన ఢిల్లీ గ్యాంగ్ రేప్ ఘటనలో ఓ జువెనైల్(బాలుడు... చట్టం ప్రకారం నేరస్థుడు అనడానికి లేదు) అత్యంత రాక్షసంగా ప్రవర్తించాడు. అందుకే జువెనైల్ వయస్సును 18 నుంచి తగ్గించాలన్న ప్రతిపాదన వచ్చింది. దానిపై చర్చ సాగింది. భిన్నాభిప్రాయాలు వ్యక్తమై ఆ ఆలోచన వెనక్కి వెళ్లింది. ఇవి ఒకట్రెండు ఘటనలే. బాలల మనసు ఎంత వికృతంగా మారిపోతుందో అక్షరాల్లో చెప్పలేం. తల్లిదండ్రుల పెంపకంలో లోపం, సమాజంలో విచ్చలవిడితనం, విదేశీ సంస్కృతి ప్రభావం... సవాలక్ష కారణాలు భావితరాన్ని చెడుమార్గంలో నడిపిస్తున్నాయి. అన్నిటికన్నా టీవీలు, సినిమాలు నెగెటివ్ ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. అందుకే నిపుణులు చెప్తున్నారు... బాల్యావస్థ పన్నేండేళ్ల వరకే అని. ఆ వయస్సుదాటిన చాలా మందిలో విశృంఖల పోకడలు కనిపిస్తున్నాయనేది నిజం. ప్రపంచవ్యాప్తంగా పిల్లల్లో మారుతున్న వైఖరికి ఎన్నో ఉదాహరణలున్నాయి.

సర్వే ఏం చెప్తోంది?

కల్లాకపటం ఎరుగని పిల్లలంటే 12లోపు వయసువారేనని బ్రిటన్లో ఓ సర్వే  తేల్చింది. లేత వయస్సులోనే పసితనం మాయమై చిచ్చరపిడుగుల్లా తయారవుతున్నారు. అమాయకత్వం దూరమై యమాముదురుల్లా వ్యవహరిస్తున్నారు. ఇది డెబ్భైఐదు శాతం మంది తల్లిదండ్రులు అంగీకరించిన వాస్తవం. పిల్లలు యుక్త వయస్సు రాకముందే సెక్స్ గురించి ఆలోచిస్తున్నట్లు తేలింది. టీవీ, మోబైల్, వీడియోగేమ్, ఇంటర్నెట్, సోషల్ నెట్ వర్కింగ్ లాంటి విషయాలకే ఎక్కువ టైం కేటాయిస్తున్నారుట. ఇక ఆడపిల్లలు ఏడెనిమిదేళ్ల నుంచి అందచందాలపై శ్రద్ధ చూపిస్తున్నారని రుజువైంది. బ్యూటీ అండ్ ఫ్యాషన్, స్టయిల్ స్టేట్మెంట్ మీద అమ్మాయిలకు బోలెడు పరిజ్ఞానం పెరిగిపోతోందిట. ఇక టీనేజ్ లోకి అడుగుపెట్టకుండానే పిల్లలందరూ సినిమా కబుర్ల మీదే ధ్యాసపెడుతున్నారనేది సర్వే సారాంశం. తల్లిదండ్రులూ బహు పరాక్! పిల్లల దృష్టిని విద్యవైపు, విజ్ఞానంవైపు మళ్లించండి. వ్యక్తిత్వం వికసించేలా బాలలకు మార్గదర్శనం చేయండి. సరికొత్త బాలల ప్రపంచం వైపు అడుగేయండి....
Where knowledge is power
Where personality blossoms
Where education is knowledge based
Where our child will emerge as a global citizen

No comments: