Thursday 14 March 2013

ఫిర్ బీ... మేరా భారత్ మహాన్!

యత్ర నార్యంతు...! 

టీవీ న్యూస్ చూసినా, పేపర్ తిరగేసినా అత్యాచారాలు, హత్యలు, యాసిడ్ దాడులు, మహిళలపై వేధింపులు. కలియుగంలో మగవారికి రాక్షస ప్రవృత్తి పెరిగిపోతుందని బ్రహ్మంగారు చెప్పారో లేదో తెలీదుగానీ... పరిస్థితి చూస్తే అలాగే ఉందనిపిస్తోంది. ఎక్కడ మహిళలు పూజలందుకుంటారో... అక్కడ దేవతలు తిరుగుతారని కదా మనం చెప్పుకుంటాం. మరేమిటి మన పరిస్థితిలా మారుతోంది? ఈ పవిత్ర భూమిలో మహిళల విషయంలో వివక్ష పెరిగిపోతోందని ఐక్యరాజ్య సమితి రూపొందించిన హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లెక్కలే చెప్తున్నాయి.

అన్నింటా సగం... అయినా ఎందుకో వివక్ష?

ఎందకీ మృగప్రవృత్తి?

ఆఫ్ఘనిస్థాన్ లాంటి చోట్ల తాలిబన్ ముష్కరమూకలు సాగిస్తున్న అరాచకానికన్నా ఘోరమైన పరిస్థితి మనదగ్గర ఉందిట. మన పొరుగునున్న పాకిస్థాన్, నేపాల్, బంగ్లాదేశ్ మానవాభివృద్ధి ఇండెక్స్ లో కొంత వెనుకబడినా... మహిళల పట్ల వివక్ష విషయంలో మనకన్నా మెరుగ్గానే ఉన్నాయిట! విద్య, ఆరోగ్యం, ఆదాయం అనే మూడు అంశాల ప్రాతిపదికన మానవాభివృద్ధి నివేదికను రూపొందించారు. 186 దేశాల లెక్కలతో జాబితా రూపొందిస్తే మనకు 136వ ర్యాంకు వచ్చింది. ఈసారి కొత్తగా విద్య, ఆరోగ్యం, జీవన ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుని ఇండెక్స్ తయారు చేస్తే 29 దేశాలకన్నా మనం ముందుండగలిగాం. స్వతంత్ర భారతదేశంలో పేదల సంఖ్య 54 శాతం దాటేసిందని లెక్కలు చెప్తున్నాయి. బంగ్లాదేశ్, నేపాల్ కన్నా ఈసంఖ్య ఎక్కువట!

మధ్యతరగతి భారతం...

మనదేశం ఆర్ధిక రంగంలో బాగానే ఉందనేది యూఎన్డీపీ నివేదిక సారాంశం. ఇండియా, చైనాలు ఈ ఇరవై ఏళ్లలో రెండింతల స్థూలజాతీయోత్పత్తిని సాధించాయి. ఈ రెండు దేశాల్లో చాలా మంది జీవన ప్రమాణాలు అనూహ్యంగా, అతివేగంగా మెరుగుపడటం చారిత్రక విశేషమేనని నివేదిక చెప్తోంది. ఇదే ప్రగతి సాధించాలంటే బ్రిటన్లో  150 ఏళ్లు, అమెరికాలో 50 ఏళ్లు పట్టిందిట. సంపన్నుడు మరింత సంపన్నుడైపోతున్నాడు. పేదవాడు కఠిన పేదవాడిగా మారిపోతున్నాడు. ఇదే సమసమాజం అని చెప్పుకునే ప్రజాస్వామ్య దేశాలు సాధిస్తున్న పురోగతి. పేదవాడిలా బతకలేక... డబ్బున్న వాడిలా అనుభవించలేని సరికొత్త మధ్యతరగతి జనం సంఖ్య పెరిగిపోతోంది. ఇండియా, చైనాల్లో మధ్య తరగతి విస్తరిస్తోందన్న లెక్కలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. 2030 నాటికి ప్రపంచంలోని 80 శాతం మధ్య తరగతి ప్రజానీకం ఆసియా దేశాల్లోనే ఉంటుందని అంచనా. అందులో 75 శాతం లెక్క తేలేది ఇండియా, చైనాల్లోనేనట.
నూటా పాతిక కోట్ల మంది భారతీయులు ఆశించేదొక్కటే... మనం పురోగతి సాధించాలి.

మహిళంటే వివక్ష చూపని సమసమాజం వైపు...

పేదవాడూ బతికి బట్టగట్టే ప్రగతిశీల ప్రజాస్వామ్యం వైపు...

మహిళలంటే వివక్షలేని చోటు ఈ భూలోకమంతా వెతికినా దొరుకుతుందా...

  • మహిళలెదుర్కుంటున్న ప్రధాన సమస్య గృహహింస. 125 దేశాల్లో గృహహింసకు కఠిన శిక్షలు విధించే చట్టాలు. 603 మిలియన్ల మంది మహిళలు నివసించే మిగతా దేశాల్లో గృహహింస అసలు నేరమే కాదుట!

    ప్రపంచవ్యాప్తంగా ప్రతి పది  మంది మహిళల్లో ఏడుగురు  జీవితకాలంలో ఎప్పుడో ఒకప్పుడు హింస ఎదుర్కుంటున్నారు139 దేశాల్లో రాజ్యాంగాలు మహిళలకు, పురుషులకు సమానత్వం ప్రసాదించాయి. 117 దేశాల్లో సమానవేతనాలు అందించే చట్టాలున్నాయి
    ప్రపంచంలో ఇప్పటికీ మగవారితో పోలిస్తే ఆగవారి వేతనాలు 10 నుంచి 30 శాతం తక్కువే
    500 ఫార్ట్యూన్ కంపెనీల్లో మేనేజ్మెంట్ బోర్డుల్లో ఎక్కువ మంది మహిళలున్నవి 53 శాతం అధిక లాభాలు గడిస్తున్నాయి

No comments: