Tuesday 5 March 2013

జ్వాల రగిలించే అక్షరం

ఆడదే ఆరంభం

అడుగంటూ ముందుకు పడితే రకరకాల పోరాట మార్గాలు. ఆచరణలో పెట్టాలనే ఆరాటం ఉంటే రకరకాల ఆలోచనలు. 'పరోపకారార్ధం ఇదం శరీరం' అని నమ్మే కొంత మంది విశిష్ట మహిళలకు ఈఏడాది 'ఇంటర్నేషనల్ వుమెన్ ఆఫ్ కరేజ్' అవార్డులు దక్కాయి. ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన వీరు వారివారి ఆలోచనలకు తగినట్లు ప్రజా ఉద్యమాల్లో భాగస్వాములవుతున్నారు. అయితే అందరి ఆయుధం ఒక్కటే అదే 'అక్షరం'.

అందరూ 'నిర్భయ'లే...

అమెరికా విదేశాంగ శాఖ ఇస్తున్న ఈ అవార్డును ఎనిమిదో తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున అందచేస్తారు. అగ్రరాజ్యం ప్రథమ మహిళ మిషెల్ ఒబామా చేతుల మీదుగా ఈ అవార్డులు ప్రదానం చేస్తారు. ఈ పది మంది నేపథ్యం ఒక్కసారి పరిశీలిస్తే  స్ఫూర్తి కలుగుతుంది. అయితే ఇందులో మొదటి మహిళ 'నిర్భయ'. 

--------

'నిర్భయ' స్ఫూర్తి...

ఢిల్లీ గ్యాంగ్ రేప్ ఘటనలో ప్రాణాలు పోగొట్టుకున్న నిర్భయ(ఇది ఆమె నిజమైన పేరుకాదు) స్ఫూర్తితో ప్రపంచమంతటినీ జాగృతం చేయడానికి అంతర్జాతీయ సహస మహిళ అవార్డును ప్రకటించింది అమెరికా. నిర్భయ తరఫున కుటుంబ సభ్యులెవరైనా దీన్ని అందుకుంటారు. నిర్భయ తర్వాత మరో ముగ్గురు మహిళలది వినూత్న పంథా. బ్లాగుల ద్వారా పోరాటం కొనసాగిస్తున్న మహిళలు వారు. అక్షరానికి ఆలోచన తోడైతే ఆయుధంగా పనికొస్తుందని చాటిన ఆ మహిళల జీవిత విశేషాల్లో కొన్ని అంశాలు చూద్దాం. ఈ ముగ్గురు నిర్బంధంలో ఉన్నందున వీరి తరపున కుటుంబ సభ్యులకు అవార్డులందిస్తారు.

--------

సెరింగ్ వీసెర్, చైనా

(టిబెట్ హక్కుల పోరాటయోధురాలు, రచయిత్రి, కవయిత్రి, బ్లాగర్)

 

చైనాకు వ్యతిరేకంగా సాగుతున్న టిబెట్ హక్కుల పోరాటంలో  సెరింగ్ కీలక పాత్ర పోషిస్తోంది. కవితలు, రచనల ద్వారా టిబెటియన్లలో చైతన్యం నింపుతోంది. ఆధ్యాత్మిక గురువు దలైలామాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిందన్న కారణంతో 2006లో అరెస్ట్ చేశారు.

---------

రజన్ జియెతునా, సిరియా

(మానవహక్కుల న్యాయవాది, లోకల్ కోఆర్డినేషన్ కమిటీ ఫౌండర్)

 

ప్రజా హక్కుల కోసం పోరాడుతున్న రజన్ కూడా అక్షరాన్నే ఆయుధంగా మలుచుకుంది. సిరియా తిరుగుబాటు దిశగా ప్రజా సమూహాన్ని నడిపిస్తోంది. పాలకపక్షం అణచివేతలను ప్రశ్నిస్తూ రాజకీయ ఖైదీల తరపున న్యాయపోరాటాలు సాగిస్తోంది. 

----------

తా ఫొంగ్ తాన్, వియత్నాం

(మాజీ పోలీసుఅధికారి, బ్లాగర్, జర్నలిస్టు)

 

పోలీసు అధికార ఉద్యోగం కన్నా ప్రజా ఉద్యమంలో గడిపే జీవితానికే పరమార్ధం ఉందని భావించిన ధీర వనిత తా ఫొంగ్ తాన్. వియత్నాంలో పాలక పక్షానికి వ్యతిరేకంగా నిరసన గళం వినిపించిన ఈమె జర్నలిస్టు. ముక్యంగా బ్లాగును మంచి వేదికగా మార్చుకుంది. తన అభిప్రాయాలను బ్లాగు ద్వారా పంచుకుంటూ జనాందోళనకు ఊతమందించింది. ఈమెను 2011లో నిర్బంధంలోకి తీసుకున్నారు.   

---------

అవార్డులు అందుకోబోతున్న మహిళలు...

  • Nirbhaya, Delhi Gang rape victim
  • Malalai Bahaduri, First Sergeant, Afghan National Interdiction Unit (Afghanistan)
  • Samira Ibrahim, Coordinator, Know Your Rights (Egypt)
  • Julieta Castellanos, Rector, National Autonomous University of Honduras (Honduras)
  • Dr. Josephine Obiajulu Odumakin, President, Campaign for Democracy (Nigeria)
  • Elena Milashina, journalist, human rights activist (Russia)
  • Fartuun Adan, Executive Director, Elman Peace and Human Rights Centre (Somalia)
  • Tsering Woeser (Wei Se), Tibetan author, poet, blogger (China)
  • Razan Zeitunah, human rights lawyer Founder, Local Coordination Committees (Syria)
  • Ta Phong Tan, blogger (Vietnam)

ఎలెనా మిలాషినా, రష్యా జర్నలిస్టు

డా. జోసెఫినె, నైజీరియా ఉద్యమకారిణి


మలాలాయ్ బహదూరి, ఆఫ్ఘన్ హక్కుల నేత



జులైటా, హోండురస్

ఫర్తూన్ ఆదాన్, సోమాలియా హక్కుల నేత



 

సమీరా ఇబ్రహీం, ఈజిప్టు హక్కుల నేత



No comments: