ఫోనులేని ఓ క్షణం...!
Step away from the tech - just for a day
Step away from the tech - just for a day
చెవుల్లో హెడ్ ఫోను, చేతుత్లో ట్యాబు లేదంటే సెల్ ఫోను, ఒళ్లో లాప్ టాప్, డెస్క్ మీద కంప్యూటర్, చివరికి భోజనం చేస్తున్న మైటులోనూ ఎదురుగుండా ప్లాస్మా టీవీ... ఒక్క నిమిషమైనా టెక్నాలజీకి దూరంగా గడప గలమా. హైటెక్ లైఫ్ స్టయిల్లో ఫోన్లో మాట్లాడకుండా, ట్విటర్లో ట్వీట్ చేయకుండా, మెయిల్ చెక్ చేసుకోకుండా, సెల్ లో మెస్సేజ్ చెక్ చేసుకోకుండా, ట్యాబ్లో గేమ్ ఆడకుండా, టీవీ చూడకుండా ఒక్క రోజైనా గడుస్తుందా.
ఎందుకు బాబూ నీకిన్ని కష్టాలు.... |
అందుకే అమెరికాలో Step away from the tech - just for a day అంటూ ప్రచారం చేస్తున్నారు. మార్చి ఒకటి సూర్యాస్తమయం నుంచి మరుసటి రోజు సూర్యాస్తమయం దాకా నేషనల్ అన్ ప్లగ్ డే పాటిస్తున్నారు. ఈ పోస్టు రాసే టైముకి అమెరికాలో ఈ బృహత్తర కార్యక్రమం ఇంకా పూర్తయి ఉండదు. దీన్ని పాటించ లేకపోయిన వారు ఓసారి ఆత్మవిమర్శ చేసుకుని మనమెందుకు ఒక్క రోజైనా టెక్నాలజీకి దూరంగా ఉండలేక పోతున్నామని ఆలోచించాలి. నిజంగా ఆచరించిన వారు అలా చేసినంద వల్ల ఎంతటి ఆనందం పొందామన్నది నలుగురికీ పంచితే బాగుంటుంది.
అమెరికా చేపట్టిన ఈ కార్యక్రమం నిజంగా స్పూర్తి దాయకం. ఇండియాలోనూ ఇలాంటి కార్యక్రమానికి ఎవరైనా ముందడుగు వేస్తే ఆహ్వానం పలికేందుకు కోట్ల మంది సిద్ధమవుతారు. ఇంతకీ అన్ ప్లగ్ డే అంటే ఏంటనే డౌట్ రావచ్చు. ఒక్క రోజు పాటు సెల్ పోను, లాప్ టాప్, కంప్యూటర్, టీవీ లాంటి వాటివేవీ వినియోగించకుండా ఉండడమన్న మాట. ఇది సుసాధ్యం కాకపోవచ్చు గానీ అసాధ్యమేమీ కాదు. నేసనల్ అన్ ప్లగ్ డే రోజున ఆచరించలేకపోయినా కనీసం వారానికి ఓ రోజైనా ఎవరికివారు స్వచ్చంధంగా దీన్ని ఆచరిస్తే ఎంతో కరెంటు ఆదా అవుతుంది. మనకు బోలెడు టైం చిక్కుతుంది. ముఖ్యంగా మానసిక ఒత్తిళ్లు, ఆందోళనలు దూరమవుతాయి. ప్రశాంతత అటే ఏమిటో అనుభవంలోకి వస్తుంది.
అన్ ప్లగ్ డే.. ఆచరిస్తే ఎంతో మేలు
ఒక్క రోజు మానసిక ఆందోళన, టెన్షన్ దూరమవుతాయి
సెల్ ఫోన్ మాట్లాడే టైం, కంప్యూటర్ వినియోగించే టైం మిగులుతాయి
ఎలక్ట్రానిక్ వస్తువులకు రెస్ట్ ఇవ్వడం వల్ల కరెంట్ ఆదా అవుతుంది
మనకు మిగిలిన సమయాన్ని చక్కగా కుటుంబ సభ్యులతో గడపొచ్చు
అలా ఔటింగ్, లాంగ్ డ్రైవ్, సిటీ ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు
బంధువులు, స్నేహితులను కలిసి మాట్లాడేందుకు కొంత టైం దొరుకుతుంది
No comments:
Post a Comment