కొత్త పోప్ ఎన్నిక లెక్కల్లోబోల్తాకొట్టిన బుకీలు!
బెట్టింగులకు అడ్డులేదా...?!
ఓ పవిత్ర కార్యం. ఆద్యంతం ఉత్కంఠ. ఈ ఎన్నికల మీద దృష్టి పెట్టిన ఫంటర్లు... కోట్ల డాలర్ల బెట్టింగులు. ప్రపంచంలో అత్యధిక మొత్తంలో బెట్టింగులు నడిచిన సందర్భం వాటికన్ సిటీలో జరిగిన పోప్ ఎన్నికేనట! అమెరికాలో బరాక్ ఒబామా సెకండ్ విక్టరీని కరెక్టుగా గెస్ చేశారు కాసినోవా ఫంటర్లు. అమెరికాలో బెట్టింగ్ నిషేధం. నిరుడు డిసెంబర్ '20న డూమ్స్ డే'. ఏదో జరిగిపోతుందని కొందరు భయపడితే ఏమీ కాదని పర్ఫెక్టుగా బెట్ కట్టారు బుకీలు. ప్రపంచంలో ఏ ఈవెంట్ అయినా రెండు మూడు నెలల ముందునుంచే బుకీల లెక్కలు మొదలువుతాయి. ఇలా బెట్టింగుల ద్వారా సొమ్ము ఆర్జించడం పాపమని బైబిల్ చెప్తోంది.
The Love of money may be the root of all evil.
వాటికన్ ఓటింగుపై ఉత్కంఠ రేపిన బుకీలు
వాటికన్ సిటీలో 266వ పోప్ ఎన్నిక మీద ఇలా భారీ ఎత్తున బెట్టింగులు నడిచాయి. ప్రపంచంలో ఇంత పెద్ద ఎత్తున బెట్టింగులు నడిచిన క్రీడలతో సంబంధంలేని సందర్భం ఇదొక్కటేనని అంతర్జాతీయ మీడియా కథనం. 600 సంవత్సరాల రోమన్ క్యాథలిక్ సమాజం చరిత్రలో తొలిసారిగా జరిగిన అరుదైన ఘట్టం పోప్ బెనడిక్ట్ 16 రాజీనామా. ఆయన వైదొలుగుతున్నారని తెలిసినప్పటి నుంచే కొత్త పోప్ ఎన్నిక మీద ఉత్కంఠ మొదలైంది. అప్పటి నుంచే బెట్టింగులూ షురూ అయ్యాయి.
బెట్టింగులకు చాలా చరిత్ర!
ముఖ్యంగా పోప్ ఎన్నికల మీద బెట్టింగులనేది ఈనాటిది కాదు. అయితే రోమన్ క్యాథిలికుల పవిత్ర పీఠమైన వాటికన్ సిటీలో బెట్టింగుల వ్యవహారాలకు ఏ విధంగానూ ఆస్కారం ఉండదు. మిగతా ప్రాంతాల్లో అవి నడుస్తుంటాయి. 1549 నుంచే వాటికన్ ఓటింగు మీద బెట్టింగులు సాగుతున్నాయట. పోప్ జాన్ పాల్ వన్ హయాం నుంచే బెట్టింగుల మీద నిషేధాజ్ఞలు విధించినా 20 వ శతాబ్ధంలో యధేశ్చగా సాగిపోయాయి. ఇక 21వ శతాబ్ధంలో కంప్యూటర్ పరిజ్ఞానం కూడా తోడైంది. ఇంటర్నెట్, మోబైల్ ఫోన్లతో బుకీలు... ఫంటర్లు...పేరేదైనా వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతోంది.
తప్పిన బుకీల లెక్కలు
ఈసారి బుకీల అంచనాలు తప్పాయనిపిస్తోంది. వాటికన్ ఓటింగు మీద బుకీల ప్రాబబుల్స్ లిస్టులో వేరే పేర్లున్నాయి. కొందరు కెనెడియన్ కార్డినల్ మారె క్వెల్లెట్, ఇటలీ కార్డినల్ యాంజెలో స్కోలా పేర్లు టాప్ ప్రయారిటీలో ఉన్నాయి. ఆస్ట్రేలియన్ కార్డినల్ జార్జి పెల్స్ ను ముందు వరసలో పెట్టారు మరికొందరు బుకీలు. ఘనాకు చెందిన పీటర్ టర్క్ సన్, నైజీరియాకు చెందిన ఫ్రాన్సిస్ ఎరింజె పేర్లు వినిపించాయి. అయితే అర్జెంటినాకు చెందిన కార్డినల్ జార్జి మారియో బెర్గొగ్లియో(76) 266వ పోప్ గా ఎన్నికయ్యారు. ఈయన పేరు బుకీల జాబితాలో 15వ ప్లేసులో ఉంది. రెండు రోజుల పాటు ఉత్కంఠ నడుమ సాగిన ఓటింగులో మిగతా కార్డినల్స్ బెర్గొగ్లియోను కొత్త పోప్ గా ఎన్నుకున్నారు. ఆయన సౌమ్యత, నిరాండరత, ఉన్నత వ్యక్తిత్వం అందరికీ నచ్చింది. అందువల్లే ఓటింగులో ముందు నిలబెట్టాయి. అయితే దీన్ని అంచనా వేయడంలో బుకీలంతా బోల్తా పడ్డారు. పోప్ పదవి కోసం రంగంలో ఉన్న 115 మంది కార్డినల్స్ తమలోంచి ఒకరిని రహస్య ఓటింగు ద్వారా ఎన్నుకున్నారు. యూరఫ్ బయటి నుంచి చాలా ఏళ్ల తర్వాత పోప్ గా ఎన్నికైన వ్యక్తి బెర్గొర్లియో. 120 కోట్ల మంది రోమన్ క్యాథలిక్కులకు ఆయన ఆరాధ్యుడు... మహా ప్రబోధకుడు. ఇకపై ఆయనను పోప్ ఫ్రాన్సిస్ గా పిలుస్తారు.
బోధకుడు... ఆపై మత ప్రబోధకుడు
యుక్త వయసులోనే మత ప్రబోధకుడిగా దేవుని సేవకు అంకితమైన బెర్గొగ్లియో తండ్రి రైల్వే ఉద్యోగి, తల్లి గృహిణి. ఈ కుటుంబం ఇటలీ నుంచి అర్జెంటినా వలస వచ్చింది. ఐదుగురు సంతానంలో బెర్గొగ్లియో ఒకరు. కెమిస్ట్రీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివిని బెర్గొగ్లియో జర్మన్, ఇటాలియన్, ఫ్రెంచ్, రోమన్ భాషల్లో దిట్ట. భాషాశాస్త్రం, సైకాలజీ, పిలాసఫీ, థియోలజీల్లో అపార విజ్ఞానం ఉంది. ఔత్సాహికులకు ఈ సబ్జెక్టులు బోధించేవారుట.
1958లోనే మత ప్రభోదకుడిగా అంకితమైన బెర్గొగ్లియో 2001లో కార్డినల్ గా ఎంపికయ్యారు. చాలా ఏళ్లుగా వాటికన్ సిటీలోనే నివాసం. అర్జెంటినా పౌరుల మాదిరిగానే ఫుట్ బాల్ అంటే అమితాసక్తి. ఉన్నత స్థానానికి వెళ్లినా నిరాండరంగానే గడుపుతుంటారు. ఎక్కడికి వెళ్లాలన్నా సాధారణ ప్రయాణికుల్లా పబ్లిక్ ట్రాన్స్ పోర్టును వినియోగించుకుంటారు. ఇంతటి గొప్ప మనసున్న కొత్త పోప్ కు ఎల్లవేళలా ప్రభువు కనిపిస్తాడు. ఆ ప్రభువుపై విశ్వాసం ఉంచినవారు కనిపిస్తారు. పోప్ ఫ్రాన్సిస్ గా మారిపోయిన బెర్గొగ్లియో రోమన్ క్యాథలిక్ సమాజానికి, పవిత్ర పీఠమైన వాటికన్ సిటీకి అధిపతిగా ఉంటారు.
(ఇందులో పవిత్రమైన పోప్ ఎన్నికల అంశం... బెట్టింగు అనే పాపకార్యం వివరాలు ప్రస్తావించాల్సి వచ్చింది. దయచేసి ఓ వార్తాంశంగా మాత్రమే పరిగణించాలని మనవి)
No comments:
Post a Comment