Saturday, 9 March 2013

అమెరికాలో 'ప్రభా'లకు మోడీ మంత్రోపదేశం!

స్వదేశం..స్వాభిమానం!

ఈమధ్య నార్టన్ యూనివర్సిటీ గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని ముఖ్య అతిథిగా పిలిచి ఆ తర్వాత వద్దనుకుంది. నార్టన్లో ఆయన ప్రసంగిస్తారన్నఅంశం పెద్ద వివాదం రేపింది. అయితేనేం మోడీ మాటను మంత్రంగా భావించే వారు బోలెడు మందున్నారు. 'గుజరాత్ మోడల్', 'మోడీ మంత్ర'... ఈ అంశాలు ప్రపంచవ్యాప్తంగా పరిశోధనాంశాలుగా మారాయి. తాజాగా అమెరికాలోని ఎడిషన్, న్యూజెర్సీ, షికాగో, ఇల్లినాయిస్ రాష్ట్రాల్లోని ప్రవాస భారతీయులనుద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోడీ మాట్లాడారు. అందులోని ముఖ్యాంశాలు...

గుజరాత్ మోడల్... మోడీమంత్ర!

- నా దృష్టిలో సెక్యులరిజం అంటే 'ఇండియా ఫస్ట్'. మనం, మనదేశం అనే ధోరణితో సాగితేనే ప్రజాస్వామ్యం బలపడుతుంది
- అభివృద్ధి అనేది మూల సూత్రం కావాలి. డెవలెప్మెంట్ మంత్రతోటే దేశం పురోభివృద్ధి సాధిస్తుంది
- భారతీయులెంతో మంది విదేశాల్లో నివసిస్తున్నారు. అలాంటి వారు మాతృభూమికి తిరిగొచ్చి గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలలు, ఆసుపత్రులు పెడితే సామాజిక సేవ చేసినట్లవుతుంది

- వాణిజ్యంలో బ్రిటీష్ కాలం నుంచే మనం ముందున్నాం. ఈ రంగంలో అవకాశాలను అందిపుచ్చుకుంటే పురోభివృద్ధి సాధిస్తాం
- గ్లోబల్ ఆర్ధిక మాంద్యంతో అమెరికా, యూరప్ దేశాలే వణికిపోయాయి. మన పారిశ్రామిక వ్యవస్థ మాత్రం నిలదొక్కుకుని నిలబడగలిగింది
- మనదగ్గర పెట్టుబడులకు అవకాశం ఉందన్నవిషయాన్ని ప్రపంచదేశాలు గుర్తించాయి. గుజరాత్ ముందడుగు వేసిందిలాగే. స్కిల్ డెవలప్ మెంట్ మీద దృష్టిసారించడమే గుజరాత్ ప్లస్ పాయింట్. 

- అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా స్కిల్ డెవలప్మెంటుకు ప్రాధాన్యం ఇస్తున్నారు
- మాతృభూమి సేవ, మన సంస్కృతికి తోడ్పాటు, మన భాషాభివృద్ధి... సమాజం కోసం అందరూ పునరంకితం అయితే మనదేశమే ప్రపంచంలో నెంబర్ వన్

No comments: