రజో... ఐదుగురు భర్తలు!
భారతంలో ద్రౌపదికి ఐదుగురు భర్తలు. కలియుగంలోనూ అలాంటి ద్రౌపది ఉంది. ఐదుగురు భర్తలూ ఉన్నారు. అయితే ఇక్కడ పాండవులు ధర్మరాజు, అర్జునుడు, భీముడు, నకులుడు, సహదేవుడు కాదు. ఆ ఐదుగురూ గుడ్డు, బిజ్జు, సంత్ రాం, గోపాల్, దినేశ్. ఆ కలియుగ ద్రౌపది... రజో వర్మ.
కలియుగ ద్రౌపది 'పాండవపుత్రుడు' |
అక్కడిదే తంతుట!
ఈ కలియుగ భారతం గురించి తెలుసుకోవాలంటే డెహ్రాడూన్ దగ్గరున్న ఓ కుగ్రామం వెళ్లాల్సిందే. భూమి మీద హక్కులు ఉండాలంటే ఇలా బహుభర్తృత్వానికి ఏ అమ్మాయైనా తలవంచాల్సిందే. ఇది అక్కడి ఆచారం. 21 ఏళ్ల రజో కూడా ఇలాగే గుడ్డూ వర్మ అనే 36 ఏళ్ల యువకుతో తాళి కట్టించుకుంది. హిందూ మతాచారాం ప్రకారమే వీరి పెళ్లయింది.
రజో వర్మ... ఐదుగురు భర్తలు |
ఇక అక్కడి నుంచి మొదలువుతుంది అసలు కథ. గడ్డూ తర్వాత ఉన్న నలుగురు సోదరులకూ రజో వర్మ ఒక్కతే భార్య. ఇందులో ఒకడు ఆమెకన్నా చిన్నవాడు. భర్తతో కలిపి నలుగురూ పెద్ద వాళ్లు. ఒక్కో రోజు ఒక్కో భర్త దగ్గర గడుపుతూ 'సహదర్మచారిణి' అనిపించుకోవాల్సిన దౌర్భాగ్యం రజోది. వీరికి పద్దెనిమిది నెలల వయసున్న కొడుకున్నాడు. ఈ సంతానం మీద ఆ ఐదుగురికీ సమాన హక్కులున్నాయి. బాధ్యతలు కూడా ఉంటాయి.
ఇదే ఈ పాండవుల కుటీరం |
అందరూ కలిసి ఉమ్మడిగా వ్యవసాయం చేసుకుంటూ బతుకుతుంటారు. తమది చింతలు లేని కుటుంబం అంటుంది రజో వర్మ. పద్దెనిమిదేళ్లకే ఐదుగురు భర్తలకు ఉమ్మడి భార్య అయిన రజో వర్మ జీవితంలో ఎన్ని చీకట్లు ఉన్నాయో తెలియదు కానీ ఆ మోములో ఎప్పుడూ నవ్వులే....!
ఇల్లూ ఇల్లాలూ... అన్నీ సరిసమానమే |
No comments:
Post a Comment