Thursday 21 March 2013

ముందున్నది నీటి చి(చు)క్కే!

వాటర్ వార్!

మూడో ప్రపంచ యుద్ధమంటూ వస్తే చమురు నిల్వలున్న దేశాలకు, వాటి మీద గుత్తాధిపత్యం సాధించాలని తహతహలాడుతున్న అగ్రరాజ్యాలకు మధ్య రావచ్చు. ఇక నీటి కోసం యుద్ధాలంటే దేశాల మధ్యే అక్కర్లేదు... అంతర్గతంగా రాష్ట్రాల మధ్య వస్తున్న యుద్ధాలతోనే హోరెత్తిపోతుంది. మన రాష్ట్రమే తీసుకుంటే ఇరుగుపొరుగునున్న మహారాష్ట్ర, తమిళనాడు, కర్నాటక... చివరికి ఒరిస్సాతోనూ వివాదాలే. తాగునీటికి గ్రామాల మధ్య, పట్టణాల్లో కాలనీల మధ్య, అపార్ట్ మెంట్లలో పక్కపక్కనుండే ఫ్లాట్ల ఓనర్ల మధ్య మాటల యుద్ధాలు... ముష్టి యుద్ధాలు. 

 

పంచభూతాలైన జలం, వాయువు, అగ్ని, ధరణి, నింగి.. వీటి మీదే మనిషి మనుగడ. ఇందులో నీటి అవసరం ఎక్కువ. భవిష్యత్తులో నీటి కొరతతో తలెత్తే సామాజిక దుష్పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఐక్యరాజ్య సమితి సెక్రెటరీ జనరల్ బాన్ కీ మూన్ హెచ్చరించారు.

"A shortage of water resources could spell increased conflicts in the future. Population growth will make the problem worse. So will climate change. As the global economy grows, so will its thirst. Many more conflicts lie just over the horizon." -- Ban Ki-Moon

ఇలాంటివన్నీ గుర్తుపెట్టుకుని జాగ్రత్త పడాల్సింది మనమే. కానీ ఇవన్నీ నీటిమీద రాతల్లా చెరిగిపోతాయి. ఏటా మార్చి22న ప్రపంచ జల దినోత్సవం జరుపుకుంటున్నాం. 1993లో ఐక్యరాజ్య సమితి తొలి జల దినోత్సవానికి రూపకల్పన చేసింది. రెండు దశాబ్ధాలుగా ఉత్సవాలైతే నిర్వహించుకుంటున్నాం గానీ జ్ఞానోదయమేదీ అయినట్లు లేదు. ఈ ఏడాదిని ఇంటర్నేషనల్ ఇయర్ ఫర్ వాటర్ కోఆపరేషన్ నినాదంతో నిర్వహిస్తున్నారు. అంటే ఉన్న వనరులను కాపాడుకుంటూ, అందరూ సామరస్యంగా వినియోగించుకోవడంపై ప్రచారం చేపడతారు.   



కన్నీటి జలపాతాలే...!

  • 345 మిలియన్ల మందికి నీటి వసతి దూరం
  • అభివృద్ధి చెందుతున్న దేశాల్లో నీటికాలుష్యం, అపరిశుభ్రత
  • 780 మిలియన్ల మందికి రక్షిత మంచినీరు కరువు
  • 120 కోట్ల మంది నీటి వసతికి దూరంగా బతికేస్తున్నారు
  • 160 కోట్ల మంది నీటి వనరులకు దగ్గరగా ఉన్నా తాగునీటి కష్టాలు
  • పట్టణ జనాభా పెరుగుదల ఏటా 60 మిలియన్లు
  • మురికివాడలో ఒకరువాడే నీరు ఓ అమెరికన్ షవర్ బాత్ తో సరి
  • కాలిఫోర్నియాలోనూ వరుసగా నాలుగో ఏడాది కరువు
  • చైనాలో 70 శాతం అర్భన్ ఏరియాలో గొంతెండుతోంది

భారత్ గొంతెండుతోంది...

  • జనాభా సంఖ్యకన్నా వేగంగా పెరుగుతున్న నీటి వినియోగం
  • వచ్చే పదేళ్లలో 40 శాతం పెరగనున్న నీటి వినియోగం 
  • 2025 నాటికి 65 శాతం జనాభాకు నీటి సంక్షోభం
  • భారత్లో 2020కి గడ్డుకాలం, 2050కి నీటియుద్ధాలు
  • మనదేశంలో 128 మిలియన్ల మందికి రక్షిత నీరు కరువు
  • 839 మిలియన్ల మందికి పారిశుధ్యం వసతి లేదు
  • మోబెల్ ఫోన్ల సంఖ్యకన్నా టాయ్ లెట్లు, వాటర్ కనెక్షన్లు తక్కువ

నీరు లేకపోతే నీరసమే...

  • ఏటా నీటి వల్ల 3.4 మిలియన్ల మరణాలు
  • ప్రతి 20 సెకండ్లకు ఓ పసిగుడ్డు మృతి
  • ప్రపంచంలోని ఆస్పత్రుల్లో సగం బెడ్లపై ఇలాంటి రోగులే
  • యుద్ధమరణాలకన్నా నీటి కాలుష్యంతో చనిపోయేవారెక్కువ
  • అనారోగ్యాలకు నీటి కొరతే ప్రధాన కారణం

నీటి చిక్కులు...

  • నీటి లభ్యత ఉప్పునీరు 97.5, శుభ్రమైన నీరు 2.5 శాతం
  • నీటి లభ్యతకు రెట్టింపుగా డిమాండ్, అంతకు రెండింతల వినియోగం
  • 2050 నాటికి నీటి లభ్యత, వినియోగం మధ్య 95 శాతం వ్యత్యాసం
  • 70శాతం వ్యవసాయం, 22శాతం పరిశ్రమలు, 8శాతం గృహావసరాలు
  • సముద్ర జలాలను డీసాల్టేషన్ చేయడమొక్కటే మార్గం
  • రోజు 200 మిలియన్ల పనిగంటలు వెచ్చిస్తున్న మహిళలు

'జల'గల్లా పీల్చేస్తున్నాం...

  • వినియోగం కన్నా వృధాయే ఎక్కువ
  • వాటర్ బాటిళ్ల మీద బోలెడు వ్యయం
  • ఏడాది బాట్లింగ్ ఖర్చులో 35 శాతంతో ప్రపంచంలో అందరికీ నీరు
  • మనిషి నిత్యం తాగుతున్న నీరు సగటున ఏడు లీటర్లు
  • శరీరానికి 55 నుంచి 80 శాతం నీరు అవసరం
  • మనిషికి తాగడానికి 5, వంటకు 10 లీటర్లు
  • స్నానం, పరిశుభ్రతకు 35 చొప్పున 55 లీటర్లు

జలమే జనం బలం

నీరు లేకుండా మనిషి మనుగడ కష్టం
మనం దృష్టి పెట్టాల్సింది... సమయం, డబ్బు, నీరు
వృధా అరికట్టడం...
పొదుపుగా వాడుకోవడం...
ఆదా చేయడం...


2 comments:

జలతారు వెన్నెల said...

మీ ప్రతి టపా, చక్కగా బొలెడన్న్ని స్టాట్స్ తో పద్దతి గా రాస్తున్నారు.టైటిల్ బాగుందండి.

nihar said...

జలతారువెన్నెల గారూ థాంక్స్!... దేనికైనా ఓ ప్రయోజనం ఉండాలనకుంటాను. అందుకే 'అల్లాటప్పాగా రాసేయకుండా వివరాలూ గట్రా జోడిస్తుంటాను. మీరిలాగే చదువుతూ ఉండండి. కృతజ్ఞతలు... నిహార్