భక్తకోటికి వందనం!
ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ధార్మిక ఉత్సవం అలహాబాద్ మహా కుభమేళా శివరాత్రి పర్వదినంతో పరిసమాప్తమైంది. జనవరి 14న మకర సంక్రాంతి రోజున గంగ, యమున, సరస్వతీ నదుల త్రివేణి సంగమంలో మకర స్నానాలతో ఈ అద్భుత పర్వం ఆరంభమైంది. అయితే 55 రోజుల పాటు ఇంత వైభవంగా సాగిన హిందూ ఆధ్యాత్మిక ఉత్సవానికి మెయిన్ స్ట్రీమ్ మీడియా పెద్దగా ఫోకస్ ఇవ్వనేలేదు.
భక్త జన సంద్రంగా త్రివేణి సంగమం |
కార్నివాల్ కన్నా తీసిపోయిందా...?
జర్మనీ రియో డి జనైరోలో జరిగే కార్మివాల్ అనగానే మీడియా కళ్లింత చేసుకుని చూస్తుంది. అలాగే జనానికీ చూపిస్తుంది. పారిస్ ఫ్యాషన్ షోలు, హాలీవుడ్ షూటింగ్ స్పాట్లు... ఇలా మన మీడియా ప్రాధాన్యాలే వేరు. ఈ వేలంవెర్రిలో అలహాబాద్ మహాకుంభమేళా కవరేజ్ అనుకున్నంతగా లేకపోయింది.
జనజీవనంలో నాగా సాధువుల అలౌకికానందం! |
4 comments:
Media is highly prejudiced against Hindu religion, despite the fact that it is full of people with Hindu Religious names. It is a great fashion for some Hindus, especially those in media, to act as if they do not have religion. If there is even a slightest item which can be portrayed against Hindu Religion, these people will pounce on it and show it highly magnified with vengeance.
This kind of odd mindset a behavior acting against one's own religion is yet to be analyzed by Psychiatrists.
మహా మాఘి నాడు అలహాబాద్ లో వున్నాను. మీరు అన్నట్లు ఒక్క మౌని అమావాస్య రోజు తప్ప.మిత రోజులు అన్ని కూడా చాల బాగా ఏర్పాట్లు చేసారు. ఒక్కరు కూడా అ పవిత్రసంగం లో మునిగి పోలేదు. కొన్ని లక్షలమంది వచ్చారు .కొంచెం కూడా తోపులాట లేదు. అందుకు నేనే ప్రత్యక్ష సాక్షిని. మీరు అన్నట్లు వేరే ఏమైనా అయితే అదే సెన్సేషనల్ అయతే వాళ్ళు నిరంతర ప్రసారం చేసే వారు. Visit web magazine at www.sirakadambam.com ఇందులో నా వ్యాసం(7th page nundi) మహాకుంభమేళ గురుంచి రాసాను.వీలు అయతే చదవండి. ధన్యవాదాలు
మన స్వదేశి మీడియా వారి కళ్ళుపడకపోవటమే మంచిది. లేకపోతె.. ఈ పాటికి అవాకులు చవాకులు పేలేవారు. వీరికన్నా విదేశి మీడియానే నయం. మనమంటే కాస్త గౌరవం చూపిస్తారు.
సర్వశ్రీ శివరామ ప్రసాదు కప్పగంతు, పూర్వఫల్గుణి, రాధాకృష్ణ కప్పగంతు గార్లకు...
నా బ్లాగు చదివి స్పందించినందుకు కృతజ్ఞతలు. ఇలాంటి అనేక సామాజిక అంశాల మీద మెయిన్ స్ట్రీమ్ మీడియా చర్చకు పూకుకోదు. చర్చించాల్సిన అవసరం ఉన్నా ఆ బాధ్యత తీసుకోదు. సోషల్ మీడియాలోనైనా మీలాంటి విజ్ఞుల కారణంగా అంతోఇంతో చర్చ జరగడం అభిలషణీయం. నా బ్లాగు చదువుతూ మీ అభిప్రయాలను తప్పకుండా పంచుకుంటారని ఆశిస్తున్నాను. పూర్వ ఫల్గుణి గారు శిరాకదంబంలో రాసిన మహా కుంభమేళా ఆర్టికల్ బాగుంది. అభినందనలు.
మరోసారి కృతజ్ఞతలతో...
-నిహార్, బ్లాగర్
Post a Comment