Thursday, 7 March 2013

16 స్వీటా... హాటా!

'కామసూత్ర'ధారణ చేయిస్తారా?!

జూనియర్ కాలేజీ గ్రౌండులోనే 'కామసూత్ర' ప్రయోగాలు...'శృంగార నైషధం' అధ్యయనాలకు సర్కారు తెరలేపుతోంది. శృంగారానికి పదహారేళ్లుంటే చాలట! ఇప్పటి దాకా పద్దెనిమిదేళ్లు దాటితేగానీ 'సెక్స్' జోలికి వెళ్లడానికి లేదు. అమ్మాయి, అబ్బాయి ఇద్దరూ అంగీకారంతో ఒక్కటైనా చట్టబద్ధంగా నేరమే. అత్యాచారం కేసు పెట్టి అబ్బాయిని జైల్లో తోసేస్తారు. అయితే ప్రభుత్వం ఈ వయో పరిమితిని 18 నుంచి 16కు తగ్గించే ఆలోచనలో ఉంది. ఢిల్లీ గ్యాంగ్ రేప్ ఘటన తర్వాత మహిళలపై అత్యాచారాలను నిరోధించడానికి సర్కారు చేసిన ఘన కార్యమేమిటయ్యా అంటే దీన్నే చూపించబోతున్నారు.

పదహారేళ్లకూ.. నీలో నాలో ఆ ప్రాయం చేసే చిలిపి పనులకు కోటి దండాలు


అంగీకారం అంటే ఏంటో...?

16 ఏళ్లంటే హైస్కూల్ చదువు పూర్తయి జూనియర్ కాలేజీలో అడుగుపెట్టే లేలేత ప్రాయం. పేరెంట్స్ అదుపు నుంచి తప్పించుకోవాలనే ఆరాటం. సమాజం కళ్లుగప్పేసి స్వేచ్ఛా పక్షుల్లా గడపాలనుకునే చిలిపి వయస్సు. ప్రేమ పేరుతో ఆకర్షణ మాయలో పడి 'పదహారేళ్లకు నీలో నాలో ఆ ప్రాయం చేసే చిలిపి పనులకు కోటి దండాలు...' అంటూ గంతులేసే నవయవ్వనాలను శృంగారం వైపు అడుగులు వేయించడం తప్పు కాదని అనగలమా?. 16 ఏళ్లు దాటిన అమ్మాయి, అబ్బాయి మధ్య పరస్పర అంగీకారంతో జరిగే లైంగిక చర్య చట్ట ప్రకారం తప్పుకాదని సర్కారు చెప్పేయబోతోంది. పరస్పర అంగీకారం అంటే ఏమిటి?. తెలిసీతెలియని వయసులో అమ్మాయి ఒప్పేసుకుంటే జరిగే నష్టం ఎవరికి?. మోహావేశంలో అంతా ప్రేమనుకుని తప్పటడుగు వేస్తే పరిస్థితి ఏమిటి?. చట్టపరమైన రక్షణలేని టీనేజీ అమ్మాయిలకు ఈ పురుషాధిపత్య...మగదురహంకార సమాజంలో భద్రత ఉంటుందని ఎలా నమ్మగలం?. అమ్మాయిలను బెదిరించి, ప్రలోభపెట్టి అంతా అయ్యాక మొహంచాటేస్తే ఆ పేరెంట్స్ పడే వేదన ఎవరికి వినిపిస్తుంది?. ఇవేవీ ఆలోచించకుండానే కేంద్ర హోంశాఖ క్రిమినల్ లా సవరణ బిల్లు ముసాయిదాను రెడీ చేసింది. దీనిపై కేంద్ర మంత్రిమండలి చర్చించడం, ఆ తర్వాత పార్లమెంటు ఆమోదముద్రతో చట్టం చేయడమే తరువాయి.

'నిర్భయ' కోరిందిదేనా..?!

ఢిల్లీ ఘటన తర్వాత జస్టిస్ వర్మ కమిషన్ సిఫారసుల మేరకు ఈమధ్యే ఓ ఆర్డినెన్స్ తీసుకువచ్చారు. లైంగిక నేరాల్లో నిందితులకు కఠిన శిక్షలు అమలయ్యేలా చట్టాలను సవరించే ప్రయత్నమిది. అయితే కొత్త బిల్లు ఆమోదం పొందితే ఆర్డినెన్స్ స్థానంలో సవరించిన కొత్త క్రిమినల్ లా అమల్లోకి వస్తుంది. మహిళలపై యాసిడ్ దాడికి దిగినా, మాటలతో వేధించినా, లైంగికంగా హింసించినా, అసభ్యపదజాలంతో మాట్లాడినా ఇక అంతే సంగతులు. కఠినమైన శిక్షలు తప్పవు. అయితే 16 ఏళ్లు దాటితే శృంగారానికి ఓకే అన్న ప్రతిపాదనపై పెద్ద చర్చ సాగుతోంది. స్వచ్చంద సంస్థలు, హక్కుల సంఘాలు కేంద్రం ఆలోచనను వ్యతిరేకిస్తున్నాయి. ఇది సరికొత్త సామాజిక దుష్పరిణామాలకు దారితీస్తుందన్న వాదన వారిది. హోంశాక ముసాయిదా ఒకట్రెండు రోజుల్లో సెంట్రల్ కేబినెట్ ముందుకు రావాల్సి ఉన్నా భిన్నాభిప్రాయాల కారణంగా జాప్యం జరుగుతోంది. మహిళలపై అత్యాచారాలను అరికట్టాలన్న ఆలోచనతో వయో పరిమితిని తగ్గించేస్తే చెడే జరుగుతుంది. మరి మన పాలకులకు జనం గోడు ఎందుకు పట్టదు?.

ఇక పేరెంట్స్ కర్మ!

టీనేజ్లో సెకండాఫ్(16 నుంచి19) యువ్వనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. టీనేజ్ నుంచి టీ ఏజ్లోకి(అంటే 20 నుంచి) అడుగు పెట్టాక కొంత వ్యక్తితం, ఆలోచనాశక్తి వచ్చే చాన్సుంది.ఈ సంధివయస్సులో... ఎదిగే క్రమంలో ఎన్నో ఆకర్షణలకు లోనయ్యే చిన్నారులను తల్లిదండ్రులు కంటిరెప్పల్లా కాపాడుకోవాలి. ఇక పదహారేళ్లు దాటాక పట్టుకోవడం కష్టమే అవుతుంది. యువత వయస్సు తెచ్చిపెట్టే ప్రమాదాల్లో పడకుండా... ప్రయోజకులయ్యే దాకా కన్నవారికి కంటి మీద కునుకుండదు. ఇప్పటికే టీనేజ్ లవ్ స్టోరీ సినిమాలు విషబీజాలు నాటుతున్నాయి. ఇక పదహారేళ్ల వరువానికి పచ్చజెండా ఊపేస్తే పరిణామాలెలా ఉంటాయో...?!    

2 comments:

Saahitya Abhimaani said...

This kind of amendments in law are only to punish those who resort to rape and other such crimes and get away scot-free under the pretext of their age. Government feels that by reducing the age to 16, if any person commits crime against women and such person is aged 16 and above they can be punished.

If such person happens to be 15 years 11 months 29 days what Government will do? Nobody knows.

Point is, there should be stringent punishments for any crime including crimes against women and such punishments should be meted out immediately within a reasonable time say 2-3 months from the date of crime.

There should be an atmosphere of fear among the general population that if any crime, even the slightest of crimes, is committed, nobody can escape the punishment. Now in the country we do not have any such fear and that's why crimes continue to happen with impunity.

Coming to your article on the issue, I want to ask one question. When the age was 18 whether the persons of that age are asking anybody to have sex? Circumstances and the upbringing of the people concerned plays a vital role in such matters.

Society at large should come out of the nefarious impact of the cheap novels, cinemas and TV serials and should start to have a respectable view on the matter of sex, leaving the pandered view of sex as a source of pleasure, which can be had without any discretion.

nihar said...

శ్రీ శివరామ ప్రసాదు కప్పగంతు గారూ...
నేను రాసిన '16 స్వీటా... హాటా... పోస్టు మీద సహేతుకంగా స్పందించారు. కృతజ్ఞతలు. నా ముఖ్యోద్దేశం పరస్పరావగాహనతో శృంగారానికి వయో పరిమితిని 18 నుంచి 16కు తగ్గించాలనే ప్రభుత్వ ఆలోచన మీద చర్చ జరగడం. దీనిపై కేంద్ర కేబినెట్లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. నేను రాసినట్లుగానే ఈ వయస్సును తగ్గిస్తే సామాజిక దుష్ఫరిణామాలు తప్పవని న్యాయ శాఖ మంత్రి వాదించారు. దీంతో ఈ అంశంపై చిదంబరం ఆధ్వర్యంలో కేబినెట్ సబ్ కమిటీని వేస్తున్నట్లు ప్రధాని ప్రకటించారు. వచ్చే శుక్రవారం ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా కేంద్రం యాంటీ రేప్ లా సవరణ బిల్లును పార్లమెంటు ముందుంచుతుంది. జువెనైల్ గా పరిగణించే ఏజ్ లిమిట్ ను తగ్గించడమనేది మరో అంశం. పదహారేళ్లు దాటిన లేత వయస్సులోనే సెక్సకు అనుమతిస్తే ముఖ్యంగా అమ్మాయిలు నష్టపోతారనేది నా ఆవేదన. నా బ్లాగు చదువుతూ మీ సూచనలు, సలహాలు ఇస్తారని ఆశిస్తాను. విమర్శలనూ స్వాగతిస్తున్నాను.
కృతజ్ఞతలతో...
-నిహార్, ఏ జూనియర్ బ్లాగర్.